తెలంగాణలో పేద ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని మొదటి విడతలో రాని ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడుదల అర్హులైన లబ్ధిదారులకు వర్తింపజేస్తామని తెలిపారు. జోగిపేటలో సాండ్ బజార్ను ఆయన ప్రారంభించారు. మెట్రిక్ టన్ 1200 రూపాయలకే ప్రభుత్వం ద్వారా ఇసుకను అందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక సరఫరాలో దళారులుగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.