దేహానికి ఆరోగ్యం ఎంత అవసరమో దేశానికి సేవా సౌభాగ్యం కూడా అంతే అవసరమని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సేవా రంగసారథులకు ఆదివారం సన్మానం చేశారు. సేవారంగంలో అంకితభావంతో కృషిచేసి అందరి మన్ననలు పొందిన వారిని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సన్మానించడం అభినందనీయమన్నారు.