ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వైద్యం పేరుతో అమాయక ప్రజలు వద్ద నుంచి ఆర్థికంగా దోచుకుంటున్నారని DYFI జిల్లా అధ్యక్షులు టీకానంద్ ఆరోపించారు. గురువారం DYFI నాయకులతో కలసి DMHOకు పిర్యాదు చేసి మాట్లాడారు. ప్రవేట్ ఆసుపత్రులలో కొంత మంది డాక్టర్లు నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్నారని ఆరోపించారు. జిల్లా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.