సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి భవాని చంద్ర సూచించారు. మంగళవారం జిల్లా కోర్టులో ఇన్సూరెన్స్ కంపెనీలు, చిట్ ఫండ్ సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బ్యాంకు మొండి బకాయిలు, చిట్ ఫండ్ ఈపీ కేసులను ఈ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య కూడా పాల్గొన్నారు.