మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొండపల్లిలో 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.