తాడూరూ శివారులో ట్రాక్టర్ ,కారు ఎదురెదురుగా ఢీకొని బోల్తా పడిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎండబెట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గ్రామానికి వస్తుండగా వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తులు తాడూరు వైపు వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొనడంతో ట్రాక్టర్ కారు బోల్తా పడింది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.