కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల కె ఎస్ ఆర్ ఎమ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 సంవత్సరాల నుండి వంట ఏజెన్సీలుగా బద్రి వెంకటసుబ్బమ్మ, గాజుల లక్ష్మమ్మ బద్రి పీరయ్య పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ తమకు సకాలంలో బిల్లులు అందినా, అందకపోయినా పిల్లలకు నాణ్యమైన భోజనాలు ఏర్పాటు చేసినామన్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వంట ఏజెన్సీగా మమ్మును తొలగించినారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు లక్షల 40 వేలు రూపాయల బకాయిలు చెల్లించకుండా మమ్ములను తొలగించడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.