నిన్న రాత్రి కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోరంట్ల వద్ద ఉన్న చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది పరీవాహక ప్రాంతాల్లో నివసించే గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని గురువారం మధ్యాహ్నం రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఎవరూ నది దాటే సాహసం చేయరాదని, తమ సూచనలు పాటించాలని అన్నారు.