అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల బాధలను పత్రికల్లో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూసి వారి పరిస్థితులను తెలుసుకొనుటకు అనంతగిరి జూనియర్ కళాశాలను రేగం మత్స్యలింగం సందర్శించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న శిధిలవస్థల్లో చేరుకున్న వసతి గృహం చూపిస్తూ వారి కష్టాలను ఎమ్మెల్యేకు వివరించారు. వర్షాకాలంలో కనీసం తలదాచుకోవటానికి కూడా వీలు లేకుండా కారిపోతుందని పేర్కొన్నారు. మాకు నూతన వసతిగృహం ఏర్పాటు చేసి మా సమస్య పరిష్కరించాలని విద్యార్థులు వినతి పత్రం అందజేశారు.