ప్రజా చైతన్యమే లక్ష్యంగా మహాకవి కాళోజీ నారాయణ రావు రచనలు సాహితీవేత్తగా సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రజాకవి స్వర్గీయ కాళోజీ నారాయణరావు 111 వ జయంతి సందర్బంగా ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ప్రజాకవి కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.