రాజమండ్రి రూరల్ మండలం పరిధిలోని ధవలేశ్వరం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆవులు ఎద్దులు ఉచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వాటి వల్ల ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశువులను ఉంచడానికి సంబంధిత అధికారులు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.