వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బోగత జలపాతం పరువళ్లు తొక్కుతుంది. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోగత జలపాతానికి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో నేడు శనివారం రోజున నిండుకుండలా మారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు జలపాతంలోని స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొడుతూ సందడి చేస్తున్నారు. లోతులోకి వెళ్ళొద్దని అటవీశాఖ రేంజర్ చంద్రమౌళి హెచ్చరించారు.