ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల దొడ్డం పల్లె గ్రామంలో జరిగిన ఓ ఇరువర్గల దాడి ఘటనను ఆపేందుకు వెళ్లిన పెద్దమనిషిపై కేసు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బొర్రా కృష్ణారెడ్డి అనే వైసిపి నాయకుడు గొడవను ఆపేందుకు వెళ్తే అతనిపై ఏ 2 కేసు పెట్టడం పోలీసులపై నాగార్జున రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తలపై దొంగ కేసులు పెడుతున్నారని ఇది మంత్రులు అధిష్టానం ఎస్పీ తదితరులు గమనించాలన్నారు.