ఈ వినాయక చవితి మట్టి ప్రతిమలతోటే పూజ చేయాలని అది పర్యావరణాన్ని రక్షిస్తుందని గాజువాక ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొలుకూరి మంగరాజు అన్నారు. నడిపూరు లోని సంకట మోచన వినాయక ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మంత్రి నరసింహమూర్తి అధ్యక్షతన ఆ ప్రాంత ప్రజలకు మట్టి వినాయకులను పంచిపెట్టే కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాయనం ఇతను కోరేవారు మట్టి విగ్రహాల్ని పూజలో పెట్టుకుంటారని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ చేసిన బొమ్మలు ఉపయోగించడం వలన మనం నిమజ్జనం చేసేటప్పుడు అవి జలరాశులు తిని చనిపోతున్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకుడిని వాడాలని అన్నారు.