గణేష్ నవరాత్రి ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో సోమవారం గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీజేలను ఉపయోగించరాదన్నారు. డబ్బు వాయిద్యాలు మాత్రమే ఉపయోగించాలి అన్నారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల్ని కాపాడుతామన్నారు.