దేవనకొండకు చెందిన చాకలి నరేశ్ తన 8 నెలల కుమారుడిని పొలం దగ్గర నీటి డ్రమ్ములో ముంచి చంపాడు. తన భార్య శ్రావణిని విచక్షణా రహితంగా కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని హత్యకు గల కారణాలు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో మొదటి భార్యను చంపి నరేశ్ జైలుకు వెళ్లాడు.