గుంటూరు నగర ప్రజలకు అధినాతన వసతులు, అత్యుత్తమ సేవలందించే లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్ట్ లను త్వరితగతిన కార్యాచరణలోకి తీసుకురావడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల ఎస్.ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో నగర అభివృద్ధిపై పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.