వనపర్తి జిల్లాలో కుష్టి వ్యాధి నివారణ కోసం వైద్య సిబ్బంది కృషి చేయాలన్న రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో ఎక్కడైనా కుష్టి వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక దశలోనే నివారించడానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ డిప్యూటీ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర చారి సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.