అన్నమయ్య జిల్లాలో జరిగిన విషాద ఘటనపై రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రాజంపేట మండలం బాలరాజుపల్లిలో చెయ్యేరు నదిలో ఎనిమిది మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, వారిలో ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న మంత్రి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలు, నదులు, జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు, యువత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు