జీఎస్టీ పై పన్నును తగ్గించడం అభినందనీయమని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్లో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని అన్నారు. ప్రపంచ పటంలోనే భారతదేశానికి మంచి మలుపు తీసుకొచ్చిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు వర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.