దృష్టి లోపం ఉన్న విధ్యార్థులను గుర్తించి వీరికి కంటి అద్దాలు పంపిణీ చేసేందుకు పరిక్షలు నిర్వహించారు. బుధవారం స్థానిక ఏపి మైనారిటీ గురుకుల పాఠశాల, మండల పరిధిలోని తాళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులను కంటి వైద్య అధికారి డా.రెడ్డెన్న పరిక్షలు చేశారు. దాదాపు 420 మంది విద్యార్థులకు కంటి పరిక్షలు నిర్వహించగా 31 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించారు. వీరికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుభాషిణి, శాంతి, నిహారిక, సిహెచ్ఓ వెంకటరత్నం, డిహెచ్ఇఓ షఫిఉన్నిషా, ప్రిన్సిపాల్ సుగుణ, స్టాఫ్ నర్సు అరుణ తదితరులు పాల్గొన్నారు.