Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 27, 2025
జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.అధికారులు తప్పనిసరిగా తమ ప్రధాన కార్యాలయాల్లోనే ఉండి పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. వర్షాల ప్రభావం, ప్రజలకు కలిగే ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులను సమయానుకూలంగా గమనించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలో రాబోవు రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావర