బుధవారం సాయంత్రం 5 గంటలకు యూరియా పంపిణీ పై రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో యూరియా పంపిణీ పై జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో యూరియా డైవర్షన్ చేయకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కి వివరించారు.. యూరియాను వాడే 87 పరిశ్రమలను గుర్తించి వాటిని, అధికారులు టీములతో తనిఖీ చేయించామని కలెక్టర్ తెలిపారు..కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టు లలో ఎక్సైజ్,మార్కెటింగ్,రెవెన్యూ, పోలీస్ అధికారులతో టీములు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.