నర్సాపూర్ జి మండలం తిమ్మాపూర్ నుండి గొల్లమాడ కు వెళ్లే దారిలో భారీ వర్షానికి రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దీంతో అటుగా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రోడ్డు మార్గం పై ఆధారపడిన గొల్లమాడ గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా కుంటాల మండలం మీదుగా గొల్లమాడకు వెళ్లాలని గురువారం ప్రకటనలో గ్రామస్తులు సూచించారు.