అధిక వర్షాల కారణంగా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో యూరియా కొరత ఏర్పడిందని తక్షణమే ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో యూరియా సమస్యను పరిష్కరిస్తామని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జిల్లా అధ్యక్షులు పోతుల మధుసూదన్ రెడ్డి రైతులకు సూచించారు.మున్సిపాలిటీలో ఏర్పడిన యూరియా కొరతను అధిగమించే విధంగా ఉన్నతాధికారులకు నివేదికను పంపినట్లు వారు పేర్కొన్నారు. త్వరలో మున్సిపాలిటీలో యూరియా సమస్యను పరిష్కరించనున్నట్లు వారు తెలిపారు .