బిడ్డకు తొమ్మిది నెలల పాటు తల్లిపాలు అందించాలని, శిశువుకు ఇవి ఎంతో శ్రేయస్కరమని ఐసీడీఎస్ సూపర్వైజర్ సీతారత్నం అన్నారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో గురువారం అంగనవాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్క తల్లి తప్పనిసరిగా చంటి బిడ్డకు తల్లి పాలు మాత్రమే అందించాలన్నారు. అనంతరం బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు.