నారాయణపేట జిల్లాలోని ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచ రాదని ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్ వ్యవస్థ పై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా నేడు సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఏడు ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ నాలుగు గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.