తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకట రామమూర్తి విశేష కృషి చేశారని జాయింట్ కలెక్టర్ శుభం బంసలు అన్నారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని డిఆర్ఓ నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివ శంకర్ నాయక్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాడుక భాష యోధుడు వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.