తాడిపత్రిలో పోలీసులు మొహరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి రానున్న నేపథ్యంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి దాదాపు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల నుంచి పోలీసులు తాడిపత్రికి వచ్చారు.