శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎన్జీవో హోం లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నీటి ప్రాజెక్టులు విభజన హామీలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు సాగు, తాగునీటి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.