అనంతపురం నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని ఆదర్శనగర్ బాబు అనే ఆటో డ్రైవర్ ఇంటిలో మంగళవారం తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. ఏకంగా మెయిన్ డోర్ పగలగొట్టి ఎనిమిది తులాల బంగారు నలభై వేల డబ్బులు అపహరించుకు ఎత్తుకెళ్లారు. బాబు తన వ్యక్తిగత పని మీద రామగిరికి వెళ్లగా ఇంటి మెయిన్ డోర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.