రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. అనంతపురంలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల కోసం రూ. 900 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు కళ్యాణదుర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నదన్నారు.