కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ ఐఓసిఎల్ ఫిల్లింగ్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ ఐఎఎస్ మరియు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం డిఐజి కోయ ప్రవీణ్ స్వయంగా తన వాహనానికి పెట్రోల్ పట్టుకుని బిల్లు చెల్లించారు.డిఐజి మాట్లాడుతూ పోలీసు సిబ్బందితో పాటు కలికిరి మండల ప్రజలందరికీ సులభంగా, ఖచ్చితమైన కొలతలతో నాణ్యమైన ఇంధనం అందించడమే ఫిల్లింగ్ స్టేషన్ ఉద్దేశమని తెలిపారు. సేవలో విశ్వాసం, నాణ్యత మా ప్రథమ కర్తవ్యం" అని డీఐజీ పేర్కొన్నారు