కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్లలో బుధవారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పర్యటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన పోరుమామిళ్ల సాయిబాబా గుడి వీధికి చెందిన విలేకరి పొదిలి షరీఫ్ అన్న పొదిలి చిన్న మహబూబ్ బాష గుండెపోటుతో మృతి చెందారన్న విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు