ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వనపర్తి బిఆర్ఎస్. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఐ కి అప్పగించడం పై బిఆర్ఎస్ వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పై విష ప్రచారం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.