నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవ హోటల్లో భారీ చోరీ జరిగింది. ఈ సందర్భంగా గుర్తు తెలియని దొంగలు బీరువాలో ఉంచిన సుమారు రూ.80 లక్షలను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఇతర ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తును చేస్తున్నట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.