శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం పల్లెవాండ్లపల్లి కి చెందిన నాగార్జున తన వికలాంగ పెన్షన్ అన్యాయంగా తొలగించారని మనస్థాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన అక్కడివారు అతడిని కదిరి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో తన పింఛన్ ను తొలగించడం పై అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.