అవనిగడ్డ మండలం అయ్య వారిపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రైతు ముళ్లపూడి వీరబాబు ఇంటి వద్ద నిలిపి ఉంచిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో సుమారు పది ఎకరాల వరిగడ్డి కూడా కాలిపోయింది. వీరబాబు కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.