తిరుపతి జిల్లా చంద్రగిరి తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు చంద్రగిరి బస్టాండ్ నుంచి విద్యార్థులు ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ఫీజు బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు సీఎం చంద్రబాబు సొంత మండలమైన చంద్రగిరిలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.