రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను వెంటనే బర్తరఫ్ చేయాలని సిఐటియు, కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.బుధవారం రాత్రి నగరంలోని జోహార్‌పురంలో సిఐటియు, కేవీపీఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర నాయకుడు సి.నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఓల్డ్‌సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు, కేవీపీఎస్ నగర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ...భేతపల్లి గ్రామంలో సోలార్ పరిశ్రమ కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడుతున్న ప్రభాకర