వర్షానికి కూలిన ఇల్లు, తప్పిన ప్రమాదం ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం బాధితురాలు షమీం బేగం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో వల్లబ్ నగర్ కాలనీలో నివాసం ఉండటంతో వర్షానికి ఇల్లు కూలిందని ఆ సమయంలో తనతోపాటు తన పిల్లలు వేరే గదిలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది గతేడాది భర్తని కోల్పోవడం జరిగిందని ఆర్థిక ఇబ్బందుల గురి కావడం జరుగుతుంది తెలిపారు. ప్రభుత్వం ఆమెను ఆదుకోవాలని కోరారు.