మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదు ఏ మొహం పెట్టుకొని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న మంత్రి జూపల్లి వెంట బాసరకు వచ్చారని, ఆయనకు బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని బిజెపి జిల్లా నాయకులు చిన్నారెడ్డి, బిజెపి మండలాల అధ్యక్షులు సాయినాథ్ పటేల్, నవీన్, సిరం సుష్మా రెడ్డి, లక్ష్మారెడ్డి, బైంసా పట్టణ అధ్యక్షులు రావుల రాము ప్రశ్నించారు. గురువారం బైంసా లోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు బాసర అభివృద్ధిక