పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాన్ బెయిలబుల్ వారంట్లను అమలు పరచాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. గురువారం సాయంత్రం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాలులో జూలై - 2025 నెలకు సంబంధించిన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నేరాలు, మహిళలపై నేరాలు, శారీరిక దాడులకు సంబంధించిన కేసుల్లో పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్లను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.