రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉన్ నబి పండగల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ లో సోమవారం మూడు గంటల సమయంలో ఎస్పీ ఆదేశాల మేరకు నారాయణపేట సీఐ శివశంకర్ హిందూ ముస్లిం మత పెద్దలు అధికారులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలంతా ఉత్సవాలు శాంతియుతంగా పరస్పర గౌరవంతో పండుగలు జరుపుకోవాలని సూచించారు. పండగలను ప్రజలంతా కులమతాలకు అతీతంగా తమ పండగలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని, ఉత్సవాలు, ర్యాలీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని అందుకు కావాల్సిన పోలీస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సిఐ తెలిపారు.