ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మార్వో కార్యాలయం నందు కారు డ్రైవర్లు నిరసన చేపట్టారు. కారు పార్కింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లిన పట్టించుకోలేదని తమకు స్థలం కేటాయించాలని ఎమ్మార్వో కి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ఎమ్మార్వో లేకపోవడంతో కారు డ్రైవర్లు అందరూ జాతీయ రహదారిపై కార్లు అడ్డుపెట్టి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని వారికి సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.