నారాయణపేట పట్టణంలో వినాయక నిమజ్జనం ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మున్సిపాలిటీ మంచినీటి సరఫరా విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గ విధులు నిర్వహిస్తున్న బురుడువాడి నివాసి శ్యాసనపల్లి శేఖర్ గుండెపోటుతో మృతి చెందాడు. నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా నృత్యాలు చేస్తుండగా ఒకేసారి కుప్పకూలి కింద పడటంతో స్నేహితులు గమనించి తేరుకున్నప్పటికి పరిస్థితి విషమించింది.ఈ విషయం తెలుసుకున్న పేట ఎస్సై వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని సి పి ఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.