షాద్నగర్ లోని కిషన్ నగర్ లో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పెన్షన్ దారుల చైతన్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అర్హులైన అందరికీ పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8వ తేదీన షాద్నగర్ లో సన్నాహక సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు భారీ సంఖ్యలో పెన్షన్ దారులు హాజరై సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు.