గోదావరి నది వరద ఉధృతి కొనసాగుతుండటంతో కె.గంగవరం మండలం, కోటిపల్లి వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతోంది. దీంతో కోటిపల్లి లంక ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. వరద తీవ్రత దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఐదు గంటల సమయంలో పాడి రైతులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే పశుగ్రాసం అందుబాటులో లేకపోవడంతో పశువులు ఇబ్బందులు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.