ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు కుడి కాలువ D4 కు గండి పడిందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. కోట శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన ఆసిఫాబాద్ కలెక్టర్ కు రైతులతో కలసి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.. వట్టివాగు కుడి కాలువకు గండిపడడంతో కొమ్ముగూడ, సల్పాలగూడ గ్రామాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ D4 కాలువకు మరమత్తులు చేపిస్తామన్నారు.