వ్యర్ధాల తరలింపు ప్రక్రియలో ప్రధాన సమస్యగా మారిన భారీ చెట్ల కొమ్మల తరలింపును సులభతరం చేసేందుకు పారిశుధ్య కార్మికులకు వుడ్ చిప్పర్ మెషిన్ ను అందుబాటులోకి తెచ్చామని కమిషనర్ నందన్ శనివారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు. మంత్రి నారాయణ సూచనలతో ఏర్పాటు చేసిన వుడ్ చిప్పర్ మిషన్ సహాయంతో భారీ చెట్ల కొమ్మలను సైతం యంత్రంలో ఉంచి పొడిగా మార్చిగలమని తెలిపారు. వుడ్ చిప్పర్ మెషిన్ వినియోగంతో వ్యర్ధాల తరలింపు వాహనాలలో తక్కువ స్థలంలోనే చెక్క పొడిని డంపింగ్ యార్డులకు సులభంగా తరలించగలమని వివరించారు